Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా కుటుంబం తరుపున అందరికీ దసరా శుభాకాంక్షలు.. సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ట్వీట్

Happy Dussehra to all on behalf of our family says CM KCRs grandson Himanshu
Advertisement
  • దసరాకు ఎప్పుడూ కుటుంబానికి దూరంగా లేనన్న హిమాన్షు 
  • దసరా కోసమే ఇంటికి వచ్చానని వెల్లడి 
  • ఇంట్లో సెలబ్రేషన్ ఫొటోస్ షేర్ చేసిన హిమాన్షు
Advertisement
తెలంగాణ ప్రజలు దసరా పండుగను అతిపెద్దదిగా భావిస్తారు. చిన్నాపెద్దా అందరూ ఆనందంగా వేడుకల్లో పాల్గొంటారు. నవమి, విజయదశమి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా శుభకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు తమ విషెష్‌ని తెలియజేస్తున్నారు. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు కూడా చేరిపోయారు. సోమవారం ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

‘మా కుటుంబం తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా దసరా పండుగను తాను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో ప్రస్తావించాడు. దసరా పండుగకు ఎప్పుడూ కుటుంబానికి దూరంగా లేనని, దసరా కోసమే వారంపాటు ఇంటికి వచ్చానని హిమాన్షు వెల్లడించాడు. అదృష్టం కొద్దీ మిడ్-సెమిస్టర్ హాలిడేస్‌ కలిసొచ్చాయని పేర్కొన్నాడు. తాతయ్య, నాన్నమ్మ దంపతులు, తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో జరిగిన దసరా వేడుకలకు సంబంధించిన ఫొటోలను హిమాన్షు షేర్ చేశాడు. కాగా హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
KCR
KTR
BRS
Telangana

More Telugu News